అమిత్ షాకు లీగల్ నోటీసులు జారీ చేస్తాం

అమిత్ షాకు లీగల్ నోటీసులు జారీ చేస్తాం

బెంగాల్ సంస్కృతిని అవమానపరిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై లీగల్ చర్యలు తీసుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ హెచ్చరించింది. 72 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. టీఎంసీ సీనియర్ నేత డెరిక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ బెంగాల్ సంస్కృతిని అవమానించి, అబద్ధాలతో మభ్యపెట్టడానికి యత్నించినట్టు ఆరోపించారు. ఈ రోజు కోల్ కత్తాలో నిర్వహించిన ర్యాలీ ఓ ప్లాఫ్ షో గా అభివర్ణించారు.

అమిత్‌షా తన ప్రసంగంలో బీజేజీ బహిరంగ సభ ప్రసారం కానీయకుండా టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపేశారంటూ టీఎంసీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఆరోణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. బెంగాల్‌లో ఇప్పుడే బీజేపీ మరో ఫ్లాప్ షో ముగిసింది. సభ విజయవంతం కాకపోవడంతో బీజేపీ ఆరోపణలకు దిగజారిందంటూ టీఎంసీ ఎదురుదాడికి దిగింది.