పశ్చిమ బెంగాళ్‌లో వచ్చే ఏడాది టీఎంసీ ఉండదు: బీజేపీ

పశ్చిమ బెంగాళ్‌లో వచ్చే ఏడాది టీఎంసీ ఉండదు: బీజేపీ

పశ్చిమ బెంగాళ్‌లో వచ్చే ఏడాది త్రుణముళ్ కాంగ్రెస్ ఉండదని బీజేపీ నేత దిలిప్ ఘోష్ అన్నారు. ఇటీవల భారత జనతా పార్టీ నేత దిలిప్ పశ్చిమ బెంగాళ్‌లో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది మే నెల నాటికి త్రుణముళ్ కాంగ్రెస్ కనిపించదని ప్రశ్చిమ బెంగాళ్ బీజేపీ యూనిట్ చీఫ్ దిలీప్ అన్నారు. ఈ ర్యాలీ పశ్చిమ బెంగాళ్ బార్దామాన్ జిల్లా దార్గాపూర్‌లో జరిగింది. ‘టీఎంసీ కూడా కరోనా లాగానే నన్ను ఏమీ చేయలేదు. కరోనాను పోగొట్టేందుకు వ్యాక్సిన్ ఉంది. వ్యాక్సిన్‌తో కరోనా పోతుంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి టీఎంసీ కూడా వచ్చే ఏడాది మే నెల నాటికి రూపురేఖలు లేకుండా పోతుంద’ని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాళ్‌కు టీఎంసీ కూడా ఒక వైరస్‌ లాంటిదేనని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌తో కలిసి దిలీప్ దార్గాపూర్‌లోని తమ నూతన ఆఫీసును ప్రారంభించారు. అయితే వచ్చే ఏడాది మధ్యాంతంలో పశ్చిమ బెంగాళ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించన తారీకులు ఇంకా ప్రకటించలేదు.