బస్ భవన్ ను ముట్టడించిన టీఎంయూ నేతలు

బస్ భవన్ ను ముట్టడించిన టీఎంయూ నేతలు

ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఆర్టీసీ నుంచి సీసీఎస్‌కు రావాల్సిన రూ.500 కోట్ల బకాయిలు, సీసీఎస్‌కు రావాల్సిన వడ్డీ రూ.45 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకూ ఆ దిశగా ప్రయత్నమేమీ చేయలేదని టీఎంయూ నేతలు మండిపడ్డారు. ఈ పోరాటం ఆగదని.. ఆఖరుకు జైలుకు వెళ్లినా, తమ ఉద్యోగాలు పోయినా అందుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు.