సమ్మెకు రెడీ అవుతున్న ఆర్టీసీ..!!!

సమ్మెకు రెడీ అవుతున్న ఆర్టీసీ..!!!

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్టుగానే రోజుల వ్యవధిలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ స్వాగతించింది.  ఎన్నో ఏళ్ల నుంచి ఇది పెండింగ్ లో ఉన్నది. ఇప్పటికి దీనిపై దృష్టిపెట్టి విలీనం చేయడంతో ఆర్టీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  

అయితే, ఏపీలో చేసినట్టుగానే తెలంగాణాలో కూడా ఆర్టీసీని విలీనం చేయాలని ఆర్టీసీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎండికి యూనియన్ నేతలు నోటీసులు ఇచ్చారు.  సమస్యలు పరిష్కారం కాకుంటే ఈనెల 25 తరువాత ఏ క్షణంలో అయినా సమ్మెకు సమ్మెకు దిగే అవకాశం ఉందని అంటున్నారు కార్మికులు.