కొనసాగుతున్న పోలింగ్.. క్యూలైన్లలో ప్రముఖులు

కొనసాగుతున్న పోలింగ్.. క్యూలైన్లలో ప్రముఖులు

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మరోవైపు అసోం, బెంగాల్‌ శాసనసభలకు మూడో దశ  పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్‌ రెండోదశ విజృంభిస్తుండటంతో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సినీ, పొలిటికల్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.

తమిళనాడులోని విరుగంబక్కంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నై స్టార్ సినీ నటుడు రజనీకాంత్ ఓటు వేశారు.‌ సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీతో కలిసి ఓటు వేశారు. తిరువాన్మయూర్‌లో నటుడు అజిత్ పాటుగా అతని భార్య షాలినీ ఓటు వేశారు. మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌, ఆయన కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్‌ చెన్నైలో తమ ‌ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు విజయ్‌ చెన్నై నీలంకరైలో సైకిల్‌ మీద వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా సినీ నటి కుష్బూ, నటుడు విక్రమ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.