రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్..!!!

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్..!!!

జమ్మూ కాశ్మీర్ విషయంలో రజినీకాంత్ ఇటీవలే స్పందించిన సంగతి తెలిసిందే.  జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైనదే అని స్పష్టం చేశారు.  త్వరలోనే అక్కడి పరిస్థితులు సర్దుకుంటాయని అన్నారు.  అలానే మోడీ, అమిత్ షాలను శ్రీకృష్ణార్జులుగా పేర్కొనడంతో వివాదం చెలరేగింది.  రజినీకాంత్ పై తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

రజినీకాంత్ మహాభారతం మరోసారి చదవాలని విజ్ఞప్తి చేశారు.  దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, ఆ రాష్ట్రాల హోదాను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.  ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని చూస్తోందని, అక్కడ ముస్లింలు ఎక్కువగా లేరని, జమ్మూ కాశ్మీర్ లో ముస్లింలు ఎక్కువగా ఉండటం వలనే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని, ఆర్టికల్ 370ని రద్దు చేయడం అంటే అక్కడి ప్రజల హక్కులను బలవంతంగా లాక్కోవడమేనని ఆరోపించారు అళగిరి.  మరి దీనిపై రజినీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.