ఏడేళ్ల తరువాత కళైమామణి..!!

ఏడేళ్ల తరువాత కళైమామణి..!!

గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కళైమామణి పురస్కారాలను ప్రకటించేది.  2011 నుంచి ఇప్పటి వరకు మరలా ఈ అవార్డులను ప్రకటించలేదు.  కాగా, 2011 నుంచి 2018 వరకు ఏడు సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను ఒకేసారి ప్రభుత్వం ప్రకటించింది.  ఇన్ని సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను ఒకేసారి ప్రకటించడంతో తమిళ సినీ పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది.  

అన్నిరకాలుగా అర్హులైన వారికే ఈ అవార్డులను ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.  రజినీకాంత్ తో బాషా వంటి సినిమాలు తీసిన సురేష్ కృష్ణ, నిర్మాత ఏ ఎం రత్నం, యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, రోబో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దర్శకుడు హరి, హీరోలు ప్రభుదేవా, కార్తీ, విజయ్ సేతుపతి, కమెడియన్ సంతానం వంటి వారు కళైమామణి అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు.  అవార్డులకు ఎంపికైన వారికి కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.