నేటి ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా

నేటి ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా

ప్రత్యేక హోదా కోసం ఏపీ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్న నేపధ్యంలో శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. నేటి పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. మిగిలిన రోజుల్లో జరగాల్సిన పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటించారు.