భారత్-ఇంగ్లాండ్ : ఈ రోజు మ్యాచ్‌లో మొదటి గంట కీలకం...
మొతేరాలో టీమిండియా మోత మోగించింది. భారత స్పిన్నర్లు మ్యాచ్‌ను తిప్పేశారు. తొలిరోజే ఇంగ్లండ్ టీమ్‌ను ఆలౌట్ చేశారు. దీంతో భారీ ఆధిక్యంపై టీమిండియా కన్నేసింది. రెండో రోజు ఫస్ట్ సెషన్‌ను బట్టి మ్యాచ్ ఎవరి వైపు నిలుస్తుందన్నది తేలనుంది.
మోతేరాలో టీమిండియా స్పిన్నర్లు మాయ చేశారు. తొలిరోజు ఇంగ్లండ్‌పై భారీ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అక్షర్ పటేల్, అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌట్ అయింది. అటు భారత్ బ్యాట్స్మెన్లు ఆచితూచి ఆడుతూ కనిపించారు. అయితే అప్పటికే కోహ్లీ, పుజారా, గిల్లను కోల్పోయింది జట్టు..! గిల్ 11 పరుగులకే అవుట్ కాగా.. తర్వాత వచ్చిన పుజారా లీచ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. మొదటిరోజు స్టంప్స్‌కు ముందు కోహ్లీ లీచ్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 57 పరుగులతో, రహానె 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో లీచ్ రెండు, ఆర్చర్ ఒక వికెట్ తీసుకున్నాడు.
మొతేరా విజయం దక్కాలంటే భారత్ భారీ స్కోరుపై కన్నేయాల్సిన అవసరం ఉంది. రెండో రోజు పూర్తిగా ఆడగలిగితే.. భారీ ఆధిక్యం ఖాయం. మరోవైపు ఇంగ్లండ్ ఎర్లీ వికెట్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. మొదటి సెషన్‌ను బట్టి..మ్యాచ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది అంచనా వేసే అవకాశం ఉంది..! అయితే రోహిత్ శర్మ నిలదొక్కుకున్నాడు కాబట్టి.. ఇదే జోష్ కొనసాగిస్తే.. టీంఇండియాకు అడ్వాంటేజ్ ఉంటుంది. రోహిత్ ఆడితే.. జట్టు భారీ స్కోరు చేయడం ఈజీ..!
క్రీజులో రోహిత్, రహానెలు ఉన్నారు. రోహిత్ ఇప్పటికే అర్థ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరికి తోడు పంత్ చెలరేగితే.. టీమిండియాకు భారీ స్కోరు ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే రోహిత్ ఈ ఫిఫ్టీని.. సెంచరీగా మలుచుకోగలుగుతాడా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రహానె తోడుగా నిలిస్తే.. టీమిండియాకే అడ్వాంటేజ్. కానీ తొలి సెషన్లో వరుసగా వికెట్లు కోల్పోతే.. సీన్ మారిపోతుంది. రెండో రోజు మ్యాచ్‌లో మొదటి గంట కీలకంగా మారనుంది.
మొత్తంగా రెండో రోజు ఆటపై ఉత్కంఠ కొనసాగుతోంది. పింక్‌బాల్ ఎలా టర్న్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ప్లేయర్లు మాత్రం స్పిన్‌ను ఆడటంతో చేతులెత్తేస్తున్నారు. ఇది టీమిండియాకు అనుకూలంగా మారింది. అయితే పింక్ బాల్ టెస్ట్ ఎవరివైపు మళ్లుతుందన్నది టీమిండియా చేయబోయే స్కోరు బట్టి ఉంటుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)