పసిడి వినియోగ దారులకు శుభవార్త - మళ్ళీ పడిపోయింది... 

పసిడి వినియోగ దారులకు శుభవార్త - మళ్ళీ పడిపోయింది... 

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకు మారిపోతున్నాయి.  ఒకరోజు ఉన్న ధరలు మరోరోజు కనిపించడం లేదు.  గత కొంతకాలంగా ఈ పరిస్థితి ఇలానే కనిపిస్తోంది.  ఇప్పటికే ధరలలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.  మాఘమాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.  ఈ సీజన్లో బంగారం విపరీతంగా సేల్ అవుతుంది.  ఈ సమయంలోనే ధరలు అధికంగా ఉంటాయి.  అయితే, ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తక్కువుగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  

హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గి రూ. 38,340కి చేరింది.  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా రూ.340 తగ్గి రూ.41,900 కు చేరింది.  ఇక బంగారంతో పాటుగానే వెండిధర కూడా క్షిణించింది.  కిలో వెండికి రూ. 400 కు తగ్గి 49,200 కు చేరింది.  పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు కొద్దిగా తగ్గడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.