వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు..

వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆసక్తికర పోరు..

వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా తలపడనున్నది. టోరీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో మూడింట్లో కివీస్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దయింది. 5 మ్యాచులాడిన దక్షిణాఫ్రికా కేవలం ఒకే మ్యాచ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోతే సఫారీలకు సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే.