వరల్డ్‌కప్‌లో ఇవాళ..

వరల్డ్‌కప్‌లో ఇవాళ..

వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు సర్వం సిద్ధమైంది. టాంటన్‌ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు తలపడబోతున్నాయి. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు వర్షం బారిన పడ్డాయి. ఇవాళ్టి మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  టీమ్‌ లైనప్‌ విషయానికొస్తే గాయం కారణంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ స్టాయినిస్‌ దూరమవడంతో అతడి స్థానంలో మిచెల్‌ మార్ష్‌ జట్టులో చేరాడు. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. పాక్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.