వరల్డ్‌కప్‌లో ఇవాళ కీలక మ్యాచ్‌

వరల్డ్‌కప్‌లో ఇవాళ కీలక మ్యాచ్‌

వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సెమీఫైనల్స్‌కు ఒక్క విజయం దూరంలో ఉన్న న్యూజిలండ్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌లూ గెలిస్తేనే సెమీస్‌కే వెళ్లేందుకు పాక్‌కు అవకాశం ఉంటుంది. ఇమాముల్, ఫఖర్‌ జమాన్, బాబర్‌ ఆజమ్‌తోపాటు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని పాక్‌ కోరుకుంటోంది. న్యూజిలాండ్‌ విషయానికోస్తే మిడిలార్డర్‌ బాగున్నా ఓపెనర్లు విఫలమవుతుండడం ఆ జట్టును కలవర పెడుతోంది.