శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఇవాళ తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు... దీంతో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేశారు టీటీడీ అధికారులు... మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది... రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలుకు అంకురార్పణ జరగనుండగా... రాత్రి 7 గంటలకు మాడ వీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు ఊరేగనున్నారు. ఎల్లుండి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 

13వ తేదీ సాయంత్రం 6.45 గంటలకు రాష్ర్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు... 13న రాత్రి 8 గంటలకు పెద్ద శేష వాహనం పై భక్తులుకు దర్శనమివ్వనున్నారు శ్రీవారు. 14న ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 8 గంటలకు హంస వాహనము... 15న ఉదయం 9 గంటలకు సింహవాహనమ, రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహనం... 16న ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనం... 17వ తేదీ ఉదయం 9 గంటలకు మోహిని అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం... 18వ తేదీ ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 8 గంటలకు గజ వాహనం... 19న ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం... 20న ఉదయం 7 గంటలకు మహారథం, రాత్రి 8 గంటలకు అశ్వ వాహనం... 21వ తేదీన ఉదయం 7 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.