10,600 ఎగువన ముగిసిన నిఫ్టి

10,600 ఎగువన ముగిసిన నిఫ్టి

డాలర్‌, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో  రెండో రోజు కూడా మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా కీలక కౌంటర్లలో మద్దతు లభించడంతో సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.  బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఆటో, మెటల్స్‌, ఆయిల్‌తో పాటు ఫార్మా రంగానికి చెందిన షేర్లు ఆకర్షణీయ లాభాలు ఆర్జించాయి. నిఫ్టి 91 పాయింట్ల లాభపడి 10,605 వద్ద ముగిసింది. నిఫ్టి 50లో 41 షేర్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 5 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌, హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు 4 శాతం నుంచి 5 శాతం వరకు పెరిగాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇన్‌ఫ్రా టెల్‌ ఒక శాతం నష్టపోగా, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా,  ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ షేర్లు నామ మాత్రపు నష్టాలతో ముగిశాయి.  ఇక బీఎస్‌ఇలో జీడీఎల్‌ 19శాతం లాభ పడింది. టైమ్‌ టెక్నో15 శాతం, ఎంసీఎక్స్‌ 14 శాతం వరకు లాభాలతో ముగిశాయి. ఐఎఫ్‌సీఐ కూడా 12 శాతం, జస్ట్‌ డయల్‌ 9 శాతం లాభపడింది.