నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

యూరో మార్కెట్ల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇటలీ,స్పెయిల్‌ దేశాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలతో యూరో సూచీలు భారీగా నష్టపోతున్నాయి. ఇవాళ కూడా ఒకటి నుంచి రెండు శాతంపైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ఉంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌లో కొనసాగాయి. నిన్న అమెరికా మార్కెట్‌కు సెలవు కావడంతో... ఎలాంటి డైరెక్షన్‌ లేకుండా మన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే మిడ్‌ సెషన్‌కల్లా మార్కెట్‌ బలహీనపడింది. నిక్కీతో సహా దాదాపు ఆసియా మార్కెట్లన్నీ ఒక శాతం వరకు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి కూడా అరశాతం నష్టంతో 55 పాయింట్లు తగ్గి 10633 వద్ద ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా మూడు శాతం లాభంతో ముగిసింది. గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐఓసీ షేరలు 1 నుంచి 2 శాతం దాకా లాభపడ్డాయి.  ఇక నష్టపోయిన నిఫ్టి ప్రధాన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ముందుంది. ఈ షేర్‌తో పాటు ఎస్‌బీఐ మూడు శాతం నష్టంతో ముగిశాయి. అలాగే బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌ బ్యాంక్‌ షేర్లు రెండు శాతం నష్టాలతో క్లోజయ్యాయి.