ఐపీఎల్ 2021 : హైదరాబాద్ బోణి కొడుతుందా...?

ఐపీఎల్ 2021 : హైదరాబాద్ బోణి కొడుతుందా...?

ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్‌రైజర్స్ కే మంచి రికార్డు ఉంది. ఇక ఇంతక ముందు ఆడిన రెండు మ్యాచ్ లలో గెలుపు దగ్గరకు వచ్చి ఓడిపోయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ 2021 లో బోణి కొట్టాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ 2021 లో ఆడిన మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ముంబై రెండు మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ కారణంగా విజయం సాధించి ఈ మ్యాచ్ లో దానిని కొనసాగించాలని చూస్తుంది. ఇక గాయం కారణంగా గత రెండు మ్యాచ్ లలో ఆడని సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లోనైనా ఆడుతాడా... లేదా నేది చూడాలి మరి.