తెలంగాణకు వర్ష సూచన..!

తెలంగాణకు వర్ష సూచన..!

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా... దాని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, జనగాం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.