ప్రయోగాల సమయం...

ప్రయోగాల సమయం...

భారత్ - ఐర్లాండ్‌ మధ్య ఈ రోజు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా... అదే జోరు కొనసాగించి... టీ20 సిరీస్‌లో చివరిదైన రెండో మ్యాచ్‌లో విక్టరీ కొట్టి సిరీస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌ సూపర్ ఫామ్‌లో ఉండడంతో సునాసయంగా విజయం సాధించొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలను కూడా చేస్తున్నారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌, ఉమేశ్‌ యాదవ్‌ను ఈ మ్యాచ్‌లో బరిలో దింపే అవకాశం ఉందంటున్నారు స్పోర్ట్స్ ఎనలిస్టులు. రోహిత్‌, ధావన్‌ను కొనసాగించి కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపే అవకాశం ఉందంటున్నారు. తుది జట్టు: ధోనీ, దినేష్ కార్తీక్, సిద్దార్థ్ కౌల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, పాండ్య, కేఎల్ రాహుల్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, సుందర్, ఉమేష్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరింత విశ్వాసంతో ఇంగ్లండ్ పర్యటన మొదలుపెడతామని పేర్కొన్నాడు రోహిత్ శర్మ. జులై 3వ తేదీ నుంచి టీమిండియా... ఇంగ్లండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు రాత్రి 8.30కి భారత్ - ఐర్లాండ్‌ మధ్య టీ-20 మ్యాచ్ ప్రారంభం కానుంది.