అమ్మకాల ఒత్తిడితో 11,400 దిగువకు నిఫ్టి

అమ్మకాల ఒత్తిడితో 11,400 దిగువకు నిఫ్టి

భారీ పతనం తరవాత ఆసియా మార్కెట్లు కోలుకున్నా.. యూరో మార్కెట్లు గ్రీన్ లో ఉన్నా మన మార్కెట్లు మాత్రం నిస్తేజంగా ముగిశాయి. ఆరంభంలో కాస్త లాభాల్లో ఉన్నా... మిడ్ సెషన్ కు ముందు నష్టాల్లోకి జారుకుంది. తరవాత కోలుకున్నా.. అధికస్థాయిలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి 11400 దిగువన క్లోజింది. క్రితం ముగింపుతో పోలిస్తే... 2 పాయింట్లు అధికంగా 11,389 వద్ద ముగిసింది. మెటల్స్ మినహా ఇతర రంగాల షేర్లలో పెద్దగా మార్పుల్లేవ్. అయితే మిడ్‌ క్యాప్‌ షేర్లలో మాత్రం భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. చాలా షేర్లు ఇటీవలి కాలంలో 30 నుంచి 40 శాతంపైగా క్షీణించాయి. ఈ మధ్య బాగా పెరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. 11,400పై నిఫ్టికి గరిష్ఠ స్థాయి 11,500 కావడంతో... ఈ స్థాయిలో తాజా కొనుగోళ్ళకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. 

నిఫ్టి ప్రధాన షేర్లలోటాటా స్టీల్ నాలుగు శాతం, టైటాన్ మూడు శాతం లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఐషర్‌ మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు రెండు శాతం దాకా లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి సేర్లలో అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్, సిప్లా కంపెనీల షేర్లు ఉన్నాయి. వీటిలో అదానీ పోర్ట్స్ భారీగా ఆరుశాతంపైగా నష్టపోయింది. అలాగే అదానీ పవర్ కూడా 10 శాతం క్షీణించింది. భారీ నష్టాలు ప్రకటించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ 8 శాతం నష్టపోయి రూ. 82.90 వద్ద ముగిసింది.వాక్రంఘి షేర్‌్ ఇవాళ 20 శాతం పెరగడం విశేషం.