స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

రోజంతా తీవ్ర ఒడుదుడుకుల మధ్య ట్రేడైన నిఫ్టి నామ మాత్రపు నష్టంతో ముగిసింది. నిన్న ప్రైవేట్‌ బ్యాంకులు నిఫ్టిని దెబ్బతీస్తే... ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతికూల ప్రభావం చూపాయి. నిన్న రాత్రి అమెరికా, ఇవాళ ఆసియా మార్కెట్లు నామ మాత్రపు ట్రేడింగ్‌ పరిమితమయ్యాయి. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు కూడా స్వల్ప నష్టంతో ట్రేడవుతున్నాయి. నిన్న దాదాపు మూడు శాతం లాభపడిన ముడి చమురు ఇవాళ కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతోంది. నిఫ్టి ఇవాళ స్వల్ప లాభంతో 11612 వద్ద ప్రారంభమైంది. తరవాత క్షీణిస్తూ మిడ్‌ సెషన్‌ సమయానికి 11564కి పడిపోయింది. తరవాత కోలుకున్నా... 2.30  గంటల తరవాత ఒక్కసారిగా నిఫ్టి పతనమైంది. పీఎస్‌యూ బ్యాంకుల్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో 18 పాయింట్ల నష్టంతో 11575 వద్ద ముగిసింది. 11550 స్థానం నిఫ్టికి అత్యంత కీలక స్థాయి అని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి ప్రధాన షేర్లలో ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌లో మారుతీ, ఎస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటో కార్ప్‌ ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లను చూసుకుంటే జెట్‌ ఎయిర్‌వేస్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో వరుసగా ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, గృహ్‌ ఫైనాన్స్‌, సుజ్లాన్‌ ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌లో టాటా స్టీల్‌ (పీపీ) ఏజిస్‌ లాగ్‌, ఇన్ఫీబీమ్‌, ఆర్‌ కామ్‌, హెచ్‌ఈజీ ఉన్నాయి.