స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ లాభాల త‌ర‌వాత నిఫ్టి స్థిరంగా ప్రారంభ‌మైంది. నిన్న యూరో మార్కెట్లు నామ మాత్ర‌పు లాభాల‌కు ప‌రిమితం కావ‌డం,  అమెరికా మార్కెట్ల‌లో ఆ మాత్రం లాభాలు కూడా లేక‌పోవ‌డంతో ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు డ‌ల్‌గా ఉన్నాయి. నిన్న సెల‌వు ఉన్నందున ఇవాళ జ‌పాన్ నిక్కీ కాస్త గ్రీన్‌లో ఉంది. షాంఘై మార్కెట్ల‌కు సెల‌వు. ఇత‌ర మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా లాభాలు అంతంత మాత్ర‌మే. ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ గ‌త మీటింగ్ మినిట్స్ రాత్రి వెల్ల‌డించారు. దీంతో డాల‌ర్ కాస్త పెరిగింది. చ‌మురు ధ‌ర‌లు కూడా కాస్త పెరిగాయి. ఈ నేప‌థ్యంలో స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి క్రితం ముగింపు వ‌ద్దే కాస్త అటూఇటుగా ట్రేడ‌వుతోంది. ప్ర‌స్తుతం 16 పాయింట్ల లాభంతో 10752 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, గెయిల్‌, అల్ట్రాటెల్ సిమెంట్‌, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ముందున్న నిఫ్టి షేర్ల‌లో ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్ బ్యాంక్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్ ఉన్నాయి. ఇత‌ర షేర్ల‌లో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, అల‌హాబాద్ బ్యాంకు షేర్లు నాలుగు శాతం లాభంతో ట్రేడ‌వుతున్నాయి.