స్థిరంగా ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్‌

స్థిరంగా ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్‌

ఆర్బీఐ ప‌ర‌ప‌తి విధానం నేప‌థ్యంలో మార్కెట్ స్థిరంగా ట్రేడ‌వుతోంది. వ‌డ్డీ రేట్ల‌ను పావు శాతం త‌గ్గిస్తుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో బ్యాంకు షేర్లు స్వ‌ల్ప లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం 11.45 గంట‌ల‌కు ఆర్బీఐ ప‌ర‌ప‌తి విధానం ప్ర‌క‌టించ‌నుంది. అమెరికాలో వారాంత‌పు ముడి చ‌మురు నిల్వ‌లు పెరిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చినా... అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో క్రూడ్ ధ‌ర‌లు పెద్ద‌గా ప‌త‌నం కాలేదు. ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. నిన్న అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు లాభాల‌తో క్లోజ్ కాగా... ఆసియా మార్కెట్లు భిన్నంగా ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్ సూచీలు ఒక మోస్త‌రు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతుండ‌గా, చైనా మార్కెట్ మాత్రం గ్రీన్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు క్రితం ముగింపుతో పోలిస్తే 17 పాయింట్లు లాభంతో ఓపెనైనా... వెంట‌నే న‌ష్టాల్లోకి జారుకుంది. ఇపుడు 10 పాయింట్ల న‌ష్టంతో 11635 వ‌ద్ద  ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో భార‌తీ ఎయిర్‌టెల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, హీరో మోటోకార్ప్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, టైటాన్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్ టెక్‌, టాటా స్టీల్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, అదానీ పోర్స్ట్ ఉన్నాయి. ఇక బీఎస్ఈలో ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్, సువేన్ లైఫ్‌, అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, బాంబే డైయింగ్ ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో టాటా స్టీల్ (పీపీ) హెచ్‌సీఎల్ టెక్‌, ఇండోస్టార్‌, ఐడియా, జెట్ ఎయిర్‌వేస్ షేర్లు ఉన్నాయి.