తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం.. ఈ రెండు రోజులు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువ ఉంటాయని తెలిపింది.