అక్టోబర్ లో టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్

అక్టోబర్ లో టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్

ప్రతీ యేటా ఘనంగా జరిగే టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్ తేదీలు తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచీ నవంబర్ 8 వరకూ ఈవెంట్స్ జరుగుతాయట. అయితే, ప్రస్తుత కోవిడ్ వైరస్ నేపథ్యంలో కొంత భాగం వర్చువల్ గానూ, మరికొంత రియల్ గానూ ఆర్గైనైజ్ చేస్తారట. 2020లోనూ జపాన్ లో టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్ కనీస జాగ్రత్తలతోనే జరిగింది. అప్పట్లో టోక్యోలో ఎక్కువగా కరోనా కేసులు లేకపోవటంతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ వీలైంది. కానీ, గత డిసెంబర్ నుంచీ జపాన్ లో మహమ్మారి తీవ్రత పెరిగింది. అందుకే, ఈ సారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 34వ టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్ కోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు.