2021 వేసవిలో ఒలింపిక్స్...?

2021 వేసవిలో ఒలింపిక్స్...?

టోక్యో ఒలింపిక్ నిర్వాహకులు 2021 వేసవిలో రీ షెడ్యూల్ చేసిన ఒలింపిక్స్ ఆటలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఎక్కువ సంకేతాలు వస్తున్నాయి. 2020 లో జరగాల్సిన ఒలంపిక్స్ కు తరువాత జరిగే ఒలంపిక్స్ కు పెద్ద మార్పు ఉండదని ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి సూచించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఒలంపిక్స్ వాయిదా పడిన తరువాత ఆ ఆటలు వేసవిలో జరగాలి అనే విషయాన్ని తెర మీదకు తెచ్చారు. వాయిదా వేసిన ఆటలు జూలై 24 న ప్రారంభమై ఆగస్టు 9 న ముగియవలసి ఉంది. వాయిదా వేయడం ద్వారా అథ్లెట్లను నిరుత్సాహపరిచారు. కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నందున చాలా మంది అథ్లెట్లు శిక్షణను ఆపవలసి వచ్చింది. టోక్యో నిర్వాహకులు ఒలంపిక్స్ ఆటలను నిర్వహించడానికి 12.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు వాయిదా కారణంగా ఆ ఖర్చు పెరిగే అవకాశం ఉంది టోక్యో నిర్వాహకులు తెలిపారు. అయితే టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఓసి 1.3 బిలియన్ డాలర్లు అందించినట్లు స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో.