టోక్యో ఒలింపిక్స్ తేదీలు ఖరారు

టోక్యో ఒలింపిక్స్ తేదీలు ఖరారు

కరోనా వైరస్ దెబ్బకు ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కాస్త వాయిదా పడ్డాయి... మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్​ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ఏడాది పాటు వాయిదా వేసింది. ఇక, ఇవాళ జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై చర్చించారు.. అనంతరం టోక్యో విశ్వక్రీడల నిర్వాహక కమిటీ షెడ్యూల్​ను ప్రకటించింది. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్  జరుగుతాయి. పారాలింపిక్స్ ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబర్ 5వరకు జరుగుతాయి.. అని ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరి ప్రకటించారు. అయితే 2021లో జరిగినా ఈ విశ్వ క్రీడలను మాత్రం టోక్యో 2020 పేరుతోనే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ అధికారికంగా 23 జూలై 2021 న ప్రారంభమవుతుంది - ప్రణాళిక కంటే 364 రోజుల తరువాత - కోవిడ్ -19 మహమ్మారి వల్ల కలిగే అంతరాయం తరువాత సిద్ధం చేయడానికి అవసరమైన “గరిష్ట సమయం” నిర్వాహకులకు ఇచ్చారు. వచ్చే జూలైకి ఆటలను రీ షెడ్యూల్ చేయడం వల్ల అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్‌లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఐఓసి ఒక ప్రకటనలో తెలిపింది.