'ఓటర్ల' కోసం టోల్ ఫ్రీ నంబర్..

'ఓటర్ల' కోసం టోల్ ఫ్రీ నంబర్..

ఓటు ఉంది..! కానీ, పోలింగ్‌స్టేషన్ ఎక్కడుందో..? పోలింగ్ స్టేషన్ కోసం ఎక్కడ వెతుకుతాం..! అనే చింత ఇక అక్కరలేదు. పోలింగ్ స్టేషన్‌ సమాచారం తెలుసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఓటర్లు తమ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 1950కి ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. దాంతోపాటు 92231 66166 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చని ఈసీ తెలిపింది. 92231 66166 నంబర్‌కు ఓటరు తన ఎపిక్ కార్డు నంబర్ టైప్ చేసి ఎస్‌ఎంఎస్ చేస్తే వెంటనే పోలింగ్‌స్టేషన్ సమాచారం ఇస్తామని.. అలాగే ఈసీఐ రూపొందించిన నాఓట్ యాప్ ద్వారా కూడా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చిన ఈసీ వెల్లడించింది.