వైసీపీలో చేరిన మరో సినీ నటుడు

వైసీపీలో చేరిన మరో సినీ నటుడు

ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలలో వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో చేరికలు బాగా జరుగుతున్నాయి. సినీ నటులు జయసుధ, అలీ, పృథ్వీ రాజ్, భాను చందర్, కృష్ణుడు, ఫిష్ వెంకట్ సహా కొందరులు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు మరో సినీ నటుడు వైసీపీలో చేరాడు. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. రాజా రవీంద్రకు జగన్ పార్టీ కండువాను కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.