అంగరంగ వైభవంగా హీరో రానా నిశ్చితార్ధం... 

అంగరంగ వైభవంగా హీరో రానా నిశ్చితార్ధం... 

టాలీవుడ్ హీరోలో ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.  లాక్ డౌన్ కు ముందు నిశ్చితార్ధం చేసుకున్న కొంతమంది హీరోలు లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు.  కారణం, ఎప్పటికి ఈ లాక్ డౌన్ ఎత్తేస్తారో తెలియదు.  ఇదిలా ఉంటె, ఇప్పుడు దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.  దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు హీరో రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  హీరో రానా, మిహికా బజాజ్ లు కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.  వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో నిశ్చితార్ధం చేసుకున్నారు.  ఇక పెళ్లి బాజా మోగటం ఒక్కటే మిగిలి ఉన్నది.