ప్రేమలో రానా... అమ్మాయి ఎవరంటే...!!!
లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రానా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఇండియన్ స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్ కంపెనీ ఉన్నప్పటికీ సొంతంగా ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఇండస్ట్రీలో అనేకమందికి సహాయసహకారాలు అందించిన ఆరు అడుగుల భల్లాలదేవుడు ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా రానా తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం విశేషం. భల్లాల దేవుడిని ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి ఎవరూ అనే దానిపై ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయిపేరు మిహికా బజాజ్. డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియోను నడుపుతున్నది. ఈవెంట్ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చేస్తున్నది. ముంబై కు చెందిన ఈ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ విమెన్ టాలీవుడ్ యాక్టర్ రానాకు ఎక్కడ పరిచయం అయ్యింది. ఎన్ని రోజులుగా వీరు ప్రేమించుకుంటున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)