ఆస్పత్రిలో చేరిన నటుడు సునీల్... ఏమైందంటే...?

ఆస్పత్రిలో చేరిన నటుడు సునీల్... ఏమైందంటే...?

సినీ నటుడు సునీల్ ఆస్పత్రిలో చేరారు.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే, అస్వస్థతకు గురైన సునీల్.. ఆస్పత్రిలో చేరారనే వార్త హల్ చల్ చేశాయి. దీనిపై స్పందించిన సునీల్.. నేను ఆరోగ్యం గానే ఉన్నా... సైనస్ మరియు ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆస్పత్రికి వచ్చానని.. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని క్లారిటీ ఇచ్చారు. కాగా, టాలీవుడ్‌లో హాస్యనటుడిగా, హీరోగా, సపోర్ట్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలో నటించిన సునీల్.. సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో.. ' సినిమాలో తన యాక్టింగ్‌తో పాటు.. డ్యాన్స్‌లతోనూ అదరగొట్టారు.