డిగ్రీ అర్హత పరీక్ష రాసిన నటి హేమ

డిగ్రీ అర్హత పరీక్ష రాసిన నటి హేమ

కొంతమంది అనుకోని పరిస్థితుల వల్ల చదువును మధ్యలో ఆపేస్తుంటారు. కానీ చదువు మీదున్న మక్కువతో ఇప్పటికీ పరీక్షలు రాస్తుంటారు. చదువు ఆగిపోయిన కానీ కొంత మంది మాత్రం చదువుకోవాలన్న ఆ కోరికను మాత్రం వయసు పై పడిన తర్వాత కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు.నల్గొండలో ఆదివారం నిర్వహించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్షకు సినీ నటి, 'మా' ఉపాధ్యక్షురాలు హేమ హాజరయ్యారు. నల్గొండ లోని ఎన్జీ కాలేజీలో డిగ్రీ పరీక్షలు రాసిన హేమ అనంతరం మీడియాతో మాట్లాడుతూ. తాను ఎన్నో రోజులనుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసి డిగ్రీ పట్టా పొందేందుకు సిద్ధమవుతున్నానని. ఇక హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య. నల్గొండలో పరీక్షలు రాసేందుకు నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. డిగ్రీతోపాటు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకోనున్నట్లు ఆమె తెలిపారు.