బ్రేకింగ్‌ : డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి

బ్రేకింగ్‌ : డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి

బొంబాయిలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు ఎన్సీబీ అధికారులు.  డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్ నటితో పాటు మరొకర్ని అరెస్ట్ చేసింది ఎన్సీబీ. ముంబైలోని మీరా రోడ్డులో ఒక హోటల్లో ఎన్సీబీ దాడులు చేసింది. అయితే... ఈ దాడుల్లో టాలీవుడ్ నటి నుంచి  400 గ్రాముల డ్రగ్స్  స్వాధీనం చేసుకున్నారు ఎన్సీబీ అధికారులు.  రూ. 10 లక్షల విలువైన డ్రగ్స్‌ సీజ్‌ చేసిన అధికారులు...  చాంద్ అనే వ్యక్తితో పాటు టాలీవుడ్ నటిని కూడా అరెస్ట్‌ చేశారు ఎన్సీబీ అధికారులు. అయితే.. ఈ నటి ఎవరనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.  టాలీవుడులో పలు సినిమాల్లో ఆ నటి యాక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ నటి  పేరు ఎన్సీబీ అధికారులు మీడియా వెల్లడిస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. కాగా... ఇప్పటికే డ్రగ్స్‌ కేసులో  హీరోయిన్‌ రకుల్‌ తో పాటు బాలీవుడ్‌ హీరోయిన్లు కూడా బుక్కయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్‌ నటి అడ్డంగా దొరికింది. అయితే... ఈ కేసులో టాలీవుడ్‌లో ఇంకే ఎవరికైనా ఇంకులు ఉన్నాయా ? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.