వైరా నుంచి పోటీ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!!

వైరా నుంచి పోటీ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!!

మరికొన్ని రోజుల్లో తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి.  అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నారు.  తాజాగా బీజేపీ కూడా పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.  రెండో జాబితాలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.  ఈరోజుల్లో సినిమాలో హీరోయిన్ గా నటించిన రేష్మ బీజేపీ తరపున ఖమ్మం జిల్లాలోని వైరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నట్టుగా జాబితాలో ఉండటం విశేషం.  

ఇటీవలే రేష్మ బీజేపీలో జాయిన్ అయింది.  బీజేపీలో యాక్టివ్ గా ఉన్న రేష్మకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.  త్వరలోనే ఎన్నికల క్యాంపైన్ ను మొదలుపెట్టబోతున్నట్టు రేష్మ ఈ సందర్భంగా తెలియజేసింది.