దొరసాని ఎలా ఉంది గురూ..!!!

దొరసాని ఎలా ఉంది గురూ..!!!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని సినిమా చేస్తున్నాడు. ఇందులో శివాత్మిక హీరోయిన్.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  విజయ్ తమ్ముడు కావడం.. అటు రాజశేఖర్ కూతురు హీరోయిన్ కావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది.  

ట్రైలర్ బాగుందనే టాక్ రావడంతో సినిమాకు హైప్ తో పాటు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  పైగా టాలీవుడ్ లో ఫస్ట్ సినిమాతో హిట్ అందుకున్న దర్శక నిర్మాతలు సినిమా గురించి పొగుడుతూ ట్వీట్ చేయడం విశేషమైతే.. ఈ మూవీకి సూపర్ ప్రొడక్షన్స్ బ్యానర్ అండ ఉండటం మరో ప్లస్ అయ్యింది.  వెరసి సినిమా బాగుంటుందని అందరి నమ్మకం.  

నమ్మకం అని కాదు ఇది నిజం అని సందీప్ రెడ్డి వంగ అంటున్నాడు.  సినిమా చాలా బాగుందని, సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి కథలో లీనం అయ్యేలా కథను నడిపించారని ట్వీట్ చేశారు.  ప్రశాంత్ వర్మ, వేణు ఉడుగుల, ప్రశాంత్ తిన్ననూరి, అజయ్ భూపతి, సందీప్ రెడ్డి వంగ లు ఈ సినిమా చూసి ట్వీట్ చేశారు.  ఇంతమంది బాగుంది అంటున్నారు అంటే ఇందులో విషయం ఉండే ఉంటుంది.  మరి చూద్దాం ఎలా ఉంటుందో.