డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట !

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట !

రెండేళ్ల క్రితం సినీ పరిశ్రమలోని పలువురిపై డ్రగ్స్‌ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో సిట్ అధికారులు అనేక మంది ప్రముఖుల్ని విచారించారు.  అన్ని వివరాలు, అధరాలు సేకరించి విచారణ చేసిన సిట్ అధికారులు నాలుగు ఛార్జ్ షీట్స్ దాఖలు చేశారు.   వాటిలో ఏ ఒక్కదానిలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్న సినీ ప్రముఖుల పేర్లు లేవు.  అంటే రెండేళ్ల క్రితం ఆరోపణలకు గురైన వారందరికీ క్లీన్ చీట్ వచ్చినట్టే అనుకోవాలి.  దాఖలు చేసిన నాలుగు ఛార్జ్ షీట్లలోని ఒకదాంట్లో సౌతాఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ అనే వ్యక్తి పేరును మాత్రం సిట్ పేర్కొంది.