ఓటు వేయండంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలు !

ఓటు వేయండంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలు !

తెలంగాణ ఎన్నికల పోలింగ్ రేపు 7వ తేదీన జరగనుంది.  ఈ ఎన్నికల్లో క్రితంసారి కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని ఎన్నికల కమీషన్ భావిస్తోంది.  అందుకే రకరకాలుగా ఓటింగ్ ప్రాధాన్యం గురించి ప్రజలకు చెబుతోంది.  ఇక తెలుగు సినీ సెలబ్రిటీలు సైతం తమ భాద్యతగా ప్రజలకు ఓటింగ్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోమని సూచిస్తున్నారు.  ఇప్పటికే పవన్ ఓటింగ్ గురించి వీడియో మెసేజ్ ఇవ్వగా ఇప్పుడు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ, నితిన్, కొరటాల శివ కూడ ప్రజల్ని ఓటింగ్లో పాల్గొనమని చెబుతున్నారు.