ఫ్యాన్స్ కు టాలీవుడ్ సెలెబ్రిటీల శ్రీరామ నవమి విషెస్...!

ఫ్యాన్స్ కు టాలీవుడ్ సెలెబ్రిటీల శ్రీరామ నవమి విషెస్...!

హిందువులు సెలెబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. హిందూ క్యాలెండరు ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజును 'శ్రీరామనవమి'గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రఖ్యాత హిందూ దేవాలయం భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మహేష్ బాబు, చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు నటులు తెలుగు వారికి, తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

"హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి  శుభాకాంక్షలు ! పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను !!' అంటూ మెగాస్టార్ చిరంజీవి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. 

'ఆనాడు లక్ష్మణరేఖ దాటిన సీతమ్మ తల్లి ఎన్నో అష్టకష్టాలు పడి చివరికి శ్రీరాముని వల్ల రావణుని చెర వీడింది. ఈనాడు కరోనా జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. ..శ్రీరామ.. రెండు రాష్ట్రాల ప్రజల్ని, యావద్భారత దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా చెర నుంచి కాపాడు స్వామి.. సర్వేజనా సుఖినోభవంతు.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు' అంటూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్వీట్ చేశారు. 

'అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు' అని రవితేజ, మహేష్ బాబు, అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేయగా... 'మీకు , మీ కుటుంబ సభ్యలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు' అంటూ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తదితరులు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.