100 చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ !

100 చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ !

తెలుగు సినిమా చూసిన అరుదైన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు.   పాలకొల్లులో జన్మించిన ఈయన 1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకుడిగా మారి 100 సినిమాలకు దర్శకత్వం వహించారు.  30 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన కెరీర్ కలిగిన కోడి రామకృష్ణ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాల్ని అందించారు.  

ఆయన తీసిన అద్భుతమైన సినిమాల్లో 'అమ్మోరు, అరుంథతి, అంకుశం, పెళ్లి, దేవి, మువ్వా గోపాలుడు, శత్రువు, మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించారు.  పరిశ్రమలోని అందరు స్టార్ హీరో హీరోయిన్లు ఈయన దర్శకత్వంలో నటించినవారే.  మధ్యతరగతి జీవితాల నుండి కథా వస్తువుల్ని తీసుకునే కోడి రామకృష్ణకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా 'అమ్మోరు, దేవి, అంజి, అరుంథతి' లాంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేశారు.

ఆయన చివరగా 2016లో 'నాగహరవు' అనే కన్నడ సినిమాను డైరెక్ట్ చేశారు.  ఆయన తొలి సినిమానే 525 రోజులు ఆడగా 10 నంది పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి.  ఇంత గొప్ప దర్శకుడ్ని కోల్పోయినందుకుగాను యావత్ తెలుగు సినీ లోకం చింతిస్తోంది.