తెలుగు దర్శకుడికి గుండెపోటు

తెలుగు దర్శకుడికి గుండెపోటు

 

టాలీవుడ్ దర్శకుడు రాజ్ కిరణ్ స్వల్ప గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు.  దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను కూకట్ పల్లిలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.  రాజ్ కిరణ్ గతంలో 'గీతాంజలి, త్రిపుర, లక్కున్నోడు' వంటి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.  ఆయన డైరెక్షన్లో రూపొందిన కొత్త చిత్రం 'విశ్వామిత్ర' చిత్రం ఈ నెల 14న అనగా రేపు విడుదలకానుంది.