హీరో రాజ్ తరుణ్ అరెస్ట్..

 హీరో రాజ్ తరుణ్ అరెస్ట్..

నార్సింగ్ కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్ట్ చేసిన తరువాత అయన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.  అనంతరం ఆయన్ను బెయిల్ పై విడుదల చేశారు.  నార్సింగ్ కారు యాక్సిండెంట్ తరువాత రాజ్ తరుణ్ కు 41 సిఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  

ఈ నోటీసులకు అనుగుణంగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కాసేపటి తరువాత బెయిల్ పై విడుదల చేశారు.  ఇదిలా ఉంటె, రాజ్ తరుణ్ ను యాక్సిడెంట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తున్న కార్తీక్ పై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.  కార్తీక్ ను కూడా అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు.