టాలీవుడ్ హీరోలను వదలని ప్రమాదాలు

టాలీవుడ్ హీరోలను వదలని ప్రమాదాలు

ఈమధ్య మన టాలీవుడ్ యువ హీరోలకు ప్రమాదాల బెడద ఎక్కువైంది.  వరుసగా ఒక్కొక్కరు షూటింగ్ సమయంలో గాయాలపాలవుతున్నారు.  మొన్నామధ్య నాగశౌర్య షూటింగ్లో పాల్గొంటూ గాయపడగా నిన్నటికి నిన్న సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ' చిత్రీకరణలో ప్రమాదానికి గురయ్యారు.  ఇక ఈరోజు చూస్తే మార్క యువ హీరో శర్వానంద్ కూడా ప్రమాదానికి గురయ్యాడు.  

'96' తెలుగు రీమేక్ కోసం థాయ్‌లాండ్‌ వెళ్లి స్కైడైవింగ్ శిక్షణ తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు.  అదృష్టమేమిటంటే వీరందరికీ చిన్న చిన్న గాయాలే అయ్యాయి.  ఇకనైనా చిత్ర యూనిట్, హీరోలు షూటింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలకు దూరంగా ఉంటే మంచిది.