తొలి సినిమాతోనే...

తొలి సినిమాతోనే...

ఒక్క ఛాన్స్ అంటూ...సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగి తిరిగి చివరకు సినిమాల్లో ఏదో ఒక అవకాశం దక్కించుకొని... ఆ అవకాశం ద్వారా ఎదిగిన హీరోలు.. నటులు... దర్శకులు ఎందరో ఉన్నారు.  మెగా ఫోన్ పట్టుకొని సినిమాకు కెప్టెన్ గా చూసుకోవాలని అందరికి ఉంటుంది.  చాలామంది దర్శకులుగా మారిన వాళ్ళు ఉన్నారు.  ఎంతమంది తొలిసినిమాతో సక్సెస్ కొట్టి.. స్టార్ దర్శకులు అయ్యారు.. కొందరికే అలాంటి అవకాశం వస్తుంది.  అవకాశం వచ్చింది కదా అని ఏదో తీసెయ్యకుండా... వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు తప్పకుండా లైఫ్ లో విజయం సాధిస్తారని ఈ దర్శకులు రుజువు చేశారు.  అందులో మొదటి వ్యక్తి త్రివిక్రమ్.  

రైటర్ గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన త్రివిక్రమ్.. దర్శకుడిగా మారి నువ్వే నువ్వే సినిమా చేశారు.  తరుణ్ తో చేసిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  దీని తరువాత త్రివిక్రమ్.. అప్పటికే స్టార్ హోదాను సంపాదించుకున్న ప్రిన్స్ మహేష్ బాబుతో అతడు చేశాడు.  మహేష్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు త్రివిక్రమ్.  బ్రిలియంట్ ట్రీట్మెంట్ తో సినిమా సూపర్ హిట్టైంది.  ఆ తరువాత త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  టాప్ హీరోలందరితో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నాడు.  

పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడిది కూడా ఇంచుమించు ఇలాంటి లైఫే కనిపిస్తుంది.  పటాస్ తో దర్శకుడిగా మారిన అనిల్... రీసెంట్ గా ఎఫ్ 2 చేశాడు.  ఈ సినిమా భారీ విజయం సాధించింది. వెంకటేష్ సినిమా వందకోట్లు వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు.  ఈ స్థాయిలో విజయం సాధించడంతో.. మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ దక్కింది.  మహేష్ తో అవకాశాన్ని నిలబెట్టుకుంటే.. అనిల్ టాప్ దర్శకుడిగా మారడం ఖాయం అవుతుంది.  

ఈ కేటగిరిలో మూడో చెప్పుకోవలసిన మూడో వ్యక్తి శివ నిర్వాణ.. 2017 లో నానితో నిన్నుకోరి సినిమా చేశాడు.  రూ.20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.46 కోట్లు వసూలు చేసింది.  నానికి మంచి హిట్ ఇచ్చిన తరువాత 2019లో నాగచైతన్యతో మజిలీ చేశాడు.  భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని సినిమాలో చక్కగా చూపించి ఈ ఏడాది భారీ హిట్ కొట్టాడు.  ఏప్రిల్ 5 న రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  టాలీవుడ్ లోని టాప్ హీరోతో నెక్స్ట్ సినిమా చేసేందుకు శివ ప్లాన్ చేస్తున్నాడు.  

ఈ లిస్ట్ లో మరో వ్యక్తి కూడా చేరిపోయాడు.  అతనే గౌతమ్ తిన్ననూరి.  సుమంత్ తో మళ్ళిరావా అంటూ మంచి సినిమా తీసి విమర్శకుల మెప్పును పొందిన గౌతమ్ తన రెండో సినిమాను నానితో జెర్సీ చేశాడు.  ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  తన నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో చేస్తానని అంటున్నాడు ఈ యువ దర్శకుడు.