ఏ హీరోలు తగ్గడం లేదు..!

ఏ హీరోలు తగ్గడం లేదు..!

ఇటీవల కాలంలో తెలుగు సినిమాల హిట్ శాతం పెరిగింది.  కంటెంట్ ఉంటె చాలు సినిమా హిట్ అవుతున్నాయి.  చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఆలోచించడం లేదు.  దర్శకనిర్మాతలు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఒక్కోసారి కంటెంట్ ఉన్నా లేకుండా కొన్ని సినిమాలు మినిమమ్ రెండున్నర గంటలు మెయింటైన్ చేస్తున్నారు.  

ఇలా రన్ టైమ్ ను పెంచుకుంటూ పోవడం వలన చాలా ఇబ్బందులు వస్తాయి.  కంటెంట్ ఉంటె ఎంతసేపైనా థియేటర్లో ఉండాలని అనిపిస్తుంది.  అదే బోర్ కొడితే వెంటనే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది.  కొన్ని సినిమాల విషయంలో అదే జరిగింది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  దాదాపు రెండు గంటల నలభై నిమిషాల వరకు సినిమా నిడివి ఉంది.  ఈ రన్ టైమ్ కనీసం రెండు గంటల వరకు తగ్గించినట్టయితే సినిమా మరోలా ఉండేది.  ఈరోజు రిలీజైన గద్దలకొండ గణేష్ సినిమా 2 గంటల 54 నిమిషాలు ఉండటం విశేషం.  ఈరోజు రిలీజైన సూర్య బందోబస్త్ కూడా 2గంటల 46 నిమిషాల రన్ టైమ్ ఉన్నది.  అటు బాలీవుడ్ సినిమాలు రెండు లేదా రెండు 20 నిమిషాల్లోపు ముగిస్తున్నారు.  కారణం సినిమా ఎంత షార్ట్ గా ఉంటె ప్రేక్షకుడు అంత ఎంజాయ్ చేస్తాడు అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.