'దేవదాసు' గాయని మృతి

'దేవదాసు' గాయని మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీకి వరసగా షాక్ లు తగులుతున్నాయి.  బ్రెయిన్ స్ట్రోక్ తో సీనియర్ నటుడు వినోద్ మృతి చెందారని తెలిసిన కొద్దిసేపటికే.. మరో షాక్ న్యూస్ బయటకు వచ్చింది.  టాలీవుడ్ లో అలనాటి మేటి గాయని రాణి (75) హైదరాబాద్ లోని కళ్యాణ్ నగర్లో కన్నుమూశారు.  దేవదాసు చిత్రంలోని "అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా" అనే పాటతో పాపులర్ అయింది.  సుమారు తన కెరీర్ లో 500 పాటలు పాడిన రాణి, శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఆమె ఆలపించడం విశేషం.  రాష్ట్రపతి భవన్లో తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణను ఆకట్టుకున్న ఘటన ఆమె సొంతం.  శ్రీలంక, ఉజ్బెక్ భాషలలో పలు పాటలు పాడిన మొదటి ఇండియన్ సింగర్ రాణి కావడం విశేషం.  1943 లో జన్మించిన రాణి, తన 8 వ ఏట నుంచే పాటలు పాడటం ప్రారంభించారు.  రూపవతి అనే తెలుగు సినిమా ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయం అయ్యారు.  అనంతరం, బాటసారి, ధర్మదేవత, జయసింహ, లవకుశ వంటి హిట్ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు.  గాయని రాణి మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.