మరో సినిమా ప్రకటించిన శర్వానంద్...
జాను సినిమా నిరాశ పరిచిన తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు . శర్వా ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే మరో సినిమా తెలుగు-తమిళ భాషలో ఒకే సమయం లో చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో నియమయాలతో కూడిన షూటింగ్స్ కు అనుమతులు ఉన్న ఇంకా ఎవరు షూటింగ్స్ ప్రారంభించడం లేదు. ఇలాంటి సమయం లో శర్వానంద్ తన మరో సినిమా అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్) బ్యానర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు అలాగే హీరోయిన్ మిగితా నటీనటుల వివరాలను త్వరలోనే తెలుపనున్నారు. ఇక ఎల్ఎల్పీ నిర్మాణ సంస్థ ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’అనే సినిమా నిర్మిస్తున్నారు. అలాగే మరో సినిమా యంగ్ హీరో నిఖిల్ తో ప్రకటించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)