ప్రపంచ టీ 20 జట్టులో ధోనికి దక్కని చోటు... కెప్టెన్ గా..?

ప్రపంచ టీ 20 జట్టులో ధోనికి దక్కని చోటు... కెప్టెన్ గా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తన ప్రస్తుత ప్రపంచ టీ 20 ఎలెవన్‌ జట్టును ఎంచుకున్నాడు. ఆ జట్టుకి కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఎనుకున్నాడు, కానీ ధోనికి అందులో చోటు ఇవ్వలేదు. రోహిత్ టీ 20 ల్లో జాతీయ జట్టుకు ఎక్కువ మ్యాచ్ లలో కెప్టెన్‌గా వ్యవహరించలేదు కానీ ఐపీఎల్‌లో మంచి రికార్డును కలిగి ఉన్నాడు. అతను ఈ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. అంతేకాకుండా టీ 20 లో అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ కూడా కోహ్లీ వెనుక ఉన్నాడు. ఇక మూడీ జట్టులో రోహిత్‌తో పాటు, వార్నర్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు, కోహ్లీ వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎబి డివిలియర్స్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా నికోలస్ పూరన్ ను తీసుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్ గా ఆండ్రీ రస్సెల్ ను తీసుకున్నాడు. సునీల్ నరైన్ మరియు రషీద్ ఖాన్ స్పిన్నర్లుగా, మిచెల్ స్టార్క్, బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్‌తో కలిసి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను తీసుకున్నాడు. 12 వ ఆటగాడిగా రవీంద్ర జడేజాను ఎనుకున్నాడు. 

టామ్ మూడీ ప్రపంచ ఎలెవన్ జట్టు : డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, నికోలస్ పూరన్(w), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా