పాక్ కు చుక్కలు చూపిస్తున్న టమోటా..!!

పాక్ కు చుక్కలు చూపిస్తున్న టమోటా..!!

ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  పాకిస్తాన్ దూకుడును ప్రదర్శించి ఇండియాతో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది.  దీంతో ఇండియా  నుంచి  ఎగుమతి కావాల్సిన అనేక వస్తువులు ఆగిపోయాయి.   ఇందులో ముఖ్యంగా టమోటా, ఉల్లిపాయలు ఉన్నాయి.  ఇండియా నుంచే ఎక్కువగా ఈ రెండింటిని పాకిస్తాన్  దిగుమతి చేసుకుంటుంది.  

టమోటా దిగుమతి లేకపోవడంతో అక్కడి ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు.  మాములు మార్కెట్ లో రూ. 30 రూపాయల లోపు దొరిగే టమోటా.. ఇప్పుడు ఏకంగా రూ. 300/- పలుకుతుంది.  పండుగ నాడు పాక్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.  టమోటా,  ధరలు కొండెక్కడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.  వీలైనంత త్వరగా రద్దును ఉపసంహరించుకోవాలని పాక్ ను ప్రజలు కోరుతున్నారు.