రేపు తిరుమలకు సీఎం కేసీఆర్

రేపు తిరుమలకు సీఎం కేసీఆర్

ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతో పాటు ఎవరెవరు వెళతారనేది తెలియాల్సి ఉంది. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తిరుమల శ్రీవారికి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 5కోట్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలను స్వామి వారికి సమర్పించారు.